రేప‌టికి వాయిదా

Balka Suman మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ సహా ఇతర బీఆర్‌ఎస్‌ నాయకులపై నమోదైన‌ కేసులపై మంచిర్యాల జిల్లా కోర్టులో వాదనలు కొనసాగాయి. సుమన్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌తో పాటు, బెయిల్‌ పిటిషన్ రేప‌టికి వాయిదా వేస్తూ మంచిర్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి తీర్పు చెప్పారు. సుమన్‌ కస్టడీ పిటిషన్‌పై రేపు ఆదేశాలు వెలువ‌రిస్తామ‌ని వెల్ల‌డించారు. కస్టడీ పిటిషన్‌పై ఇప్పటికే బాల్క సుమన్‌ అడ్వకేట్ల బృందం కౌంటర్‌ పిటిషన్‌ వేసిన విష‌యం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసు అధికారే ఇన్వెస్టిగేషన్‌ అధికారిగా ఉన్నారని, విచారణ పూర్తయ్యాకే కోర్టు రిమాండ్‌ విధించిందని, ఇలాంటి పరిస్థితుల్లో కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని కౌంటర్‌ దాఖలు చేశారు.

సుమన్‌ను నాలుగు రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోరుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే దానికి సంబంధించిన తీర్పు రేపు వెలువ‌రిస్తామ‌ని కోర్టు తెలిపింది. అదే స‌మ‌యంలో సుమ‌న్‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోర‌తూ ఆయన తరఫు న్యాయవాదులు వేసిన కేసు తీర్పు సైతం రేపు వెలువ‌రించ‌నున్నారు.

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like