బాల్క సుమ‌న్ క‌స్ట‌డీ పిటిష‌న్ ర‌ద్దు

మంచిర్యాల జిల్లా కోర్టులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను త‌మ క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని కోరుతూ పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ర‌ద్దు చేస్తూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ తీర్పు చెప్పారు. త‌మ‌కు నాలుగు రోజుల పాటు సుమ‌న్‌ను క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని పోలీసులు క‌స్ట‌డీ పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. అయితే, దానికి సంబంధించి బాల్క సుమన్‌ అడ్వకేట్ల బృందం కౌంటర్‌ పిటిషన్‌ వేసిం ది. కేసు నమోదు చేసిన పోలీసు అధికారే ఇన్వెస్టిగేషన్‌ అధికారిగా ఉన్నారని, విచారణ పూర్తయ్యాకే కోర్టు రిమాండ్‌ విధించిందని, ఇలాంటి పరిస్థితుల్లో కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని కౌంటర్‌ దాఖలు చేశారు.

ఈ నేప‌థ్యంలోనే దీనిపై వాద‌న‌లు, ప్ర‌తివాద‌న‌లు జ‌రిగాయి. దీంతో పోలీసుల క‌స్ట‌డీ అవస‌రం లేద‌ని భావించిన కోర్టు ఈ మేర‌కు క‌స్ట‌డీ పిటిష‌న్ డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువ‌రించింది. అరెస్టు చేసే సమయంలో రెండు గంటల ముందు సమాచారం ఇవ్వకుండా, ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పకుండా సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా హడావుడిగా అరెస్టు చేశారని.. ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో కస్టడీకి ఇవ్వ వ‌ద్ద‌ని సుమ‌న్ న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like