జైలు నుండి బాల్క సుమన్ విడుదల

Balka Suman: ఆదిలాబాద్ జిల్లా జైలు నుండి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విడుదల అయ్యారు. క్యాత‌న్‌ప‌ల్లి మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా గొడ‌వ‌కు కార‌ణ‌మంటూ బాల్క సుమ‌న్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు రిమాండ్ విధించిన నేపధ్యంలో సుమన్ ను జిల్లా జైలు కు తరలించారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ మంచిర్యాల కోర్టు తీర్పు చెప్పింది. క్యాత‌న్‌ప‌ల్లి మున్సిపాలిటీ పీఠం కోసం జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో బాల్క సుమ‌న్ హ‌స్తం ఉందంటూ పోలీసులు అరెస్టు చేసి కోర్టు హాజ‌రుప‌రిచారు. ఈ నేప‌థ్యంలో గ‌త నెల 18న కోర్టు ఆయ‌నకు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ నేప‌థ్యంలో బాల్క సుమ‌న్ అరెస్టు అక్ర‌మ‌మ‌ని సుప్రీం కోర్టు ఇచ్చిన విధివిధానాలు క‌నీసం పాటించ‌కుండా ఆయ‌న‌ను అరెస్టు చేశార‌ని సుమ‌న్ త‌ర‌ఫు లాయ‌ర్లు వాదిస్తూ వ‌చ్చారు.

మ‌రోవైపు పోలీసులు సైతం ఆయ‌న‌ను త‌మ క‌స్ట‌డీకి అప్ప‌గించాల‌ని మంచిర్యాల కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై వాదోప‌వ‌ద‌న‌లు జ‌రిగిన అనంత‌రం పోలీసుల క‌స్ట‌డీ పిటిష‌న్ కోర్టు కొట్టివేసింది. మ‌రోవైపు సోమవారం బాల్క సుమ‌న్‌కు బెయిల్ మంజూరు చేస్తూ జిల్లా సెష‌న్స్ జ‌డ్జి ఏ. వీర‌య్య తీర్పు చెప్పారు. రూ. 25,000 వేల పూచిక‌త్తు, ఇద్ద‌రు ష్యూరిటీలు సమ‌ర్పించాల‌ని స్ప‌ష్టం చేశారు. అదే స‌మ‌యంలో కేసులో ఏ 1, ఏ 2, ఏ 4, ఏ 8 ప్ర‌తి ఆదివారం రామ‌కృష్ణాపూర్ పోలీస్‌స్టేష‌న్‌లో హాజ‌రు కావాల‌ని తీర్పు వెలువ‌రించారు.

సుమ‌న్‌ విడుదల నేపధ్యంలో జైలు వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like