ప్రశ్నిస్తే… 14 కేసులు…
Akula Srivani:ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే తనకు ప్రభుత్వం 14 కేసులు బహుమతిగా ఇచ్చిందని భారతీయ జనతా పార్టీ నేత ఆకుల శ్రీవాణి స్పష్టం చేశారు. ఈ రోజు ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రశ్నించి, వాటిని బయటపెట్టినందుకు తనపై 14 పోలీస్ కేసులు పెట్టారని స్పష్టం చేశారు. నిధులు సరిగ్గా కేటాయించాలని.. డివిజన్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరడం తప్పా శ్రీవాణి ప్రశ్నించారు.
ఎన్ని కేసులు పెట్టినా, తనపై ఎన్ని విమర్శలు చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. న్యాయం, ధర్మం కోసం పోరాడటం నేరం కాదని వెల్లడించారు. తప్పును ప్రశ్నించడం నా బాధ్యత… నా పోరాటం కొనసాగుతుందంటూ స్పష్టం చేశారు. ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టడం ఒక పౌరురాలిగా, నాయకురాలిగా తన బాధ్యత అని వెల్లడించారు.