తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate Dropped: దేశంలో పసిడి ధరలు తగ్గుతున్నాయి. ఈ ధరలు వారం పది రోజులుగా వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. నేడు కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ వారం ప్రారంభంలో సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయిలను తాకిన పసిడి ప్రస్తుతం తగ్గింపు దిశగా సాగుతోంది. భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.16,112లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.14,769లకు చేరింది.
భారతీయ మార్కెట్‌లో పసిడి ప్రేమికులకు ఊరట లభిస్తోంది. కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. వారం కిందటి వరకు సరికొత్త రికార్డులను సృష్టించిన పసిడి, పది రోజులుగా దిగివస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల దేశీయంగా కూడా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. సామాన్యులకు ఇది గోల్డ్ ఛాన్స్ అని చెప్పవచ్చు. మార్చి 7 (శనివారం) నాటికి దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం మన దేశంలో 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ. 16,112 వద్ద ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 14,769 కు చేరుకుంది. అంటే తులం బంగారం కొనాలంటే లక్షన్నర పైనే ఖర్చు చేయాల్సి వస్తోంది.
ధరలు తగ్గుతున్నా, గత ఏడాదితో పోలిస్తే ఇవి ఇంకా భారీ స్థాయిలోనే ఉండటం గమనార్హం. మన తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,61,120 ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,47,690 గా ఉంది. వైజాగ్, తిరుపతి వంటి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో ధరలు మిగిలిన ప్రాంతాల కంటే కాస్త ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 1,63,190 గా రికార్డ్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు 24 క్యారెట్లకు రూ. 1,61,270 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
వెండి ధరలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మన దేశంలో గ్రాము వెండి ధర రూ.289.90 పలుకుతోంది. కేజీ వెండి కొనాలంటే ఏకంగా రూ. 2,89,900 చెల్లించాల్సిందే. నిన్నటితో పోలిస్తే కేజీ వెండిపై వంద రూపాయల మేర స్వల్ప తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలో వెండికి ఉన్న డిమాండ్ ఆధారంగా మన దేశంలో కూడా ధరలు తరచూ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ విలువ పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులను లాభాల్లోకి మార్చుకుంటున్నారు. దీనివల్ల పసిడి ధరలు తగ్గుతున్నాయి.