సమస్యలు వింటూ.. ఆదేశాలు జారీ చేస్తూ..
MLA Prem Sagar Rao:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం మంచిర్యాలలో నిర్వహించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30, 16, 53 డివిజన్లలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. తమ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.