అపరిశుభ్రతపై కలెక్టర్ సీరియస్.. ఆస్పత్రి సిబ్బందిపై వేటు!
ఆసుపత్రి అంటే ఇలాగే ఉంటుందా…? ఇదేం తీరు… ఇది కరెక్ట్ కాదంటూ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె దహెగాం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆమె.. హాస్పిటల్ చుట్టుపక్కల పిచ్చిమొక్కలు, చెత్త, ప్లాస్టిక్ తో నిండిపోయి ఉండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా చీపురు చేతపట్టి ఊడ్చేశారు. ఆసుపత్రిలో రిజిస్టర్లు తనిఖీ చేశారు.
విధుల పట్ల కొందరు ఉద్యోగుల నిర్లక్ష్యం బయటపడటంతో ఆమె మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ రావుజీని విధుల నుంచి తొలగించారు. అలాగే కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సీతారాం.. హెల్త్ అసిస్టెంట్ అభిలాష్, ఎల్టీ వినోద్, ఎల్టీ సంజీవ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.