టీ 20 వరల్డ్ కప్ లో భారత్ విజయం

టీ20 ప్రపంచకప్‌ భారత్ ను వరించింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 255 పరుగులు చేసి, ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. సంజూ శాంసన్ 89, అభిషేక్ శర్మ 52, ఇషాన్ కిషన్ 54 పరుగులతో రాణించారు. 255 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 159 పరుగులకు ఆల్ ఔట్ అయింది. దీంతో 96 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లలో ఇదే అత్యధిక స్కోరు (255/5) కావడం గమనార్హం.

సంజూ సామ్సన్ (89), అభిషేక్ శర్మ (52), ఇషాన్ కిషన్ (54) చెలరేగి ఆడటంతో భారత్ 2026లో మరోసారి ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసింది. భారత్ 2007 (MS ధోని) లో, 2024 (రోహిత్ శర్మ).. ఆధ్వర్యంలో టీ 20 ప్రపంచ కప్ సాధించగా.. 2026 లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like