రంజాన్ తోఫాల పంపిణీ

రంజాన్ పండుగ సందర్భంగా కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రంజాన్ తోఫా పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఈ తోఫాల‌ను పంపిణీ చేశారు. హజీపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్, దండేపల్లి మండలం పద్మశాలి భవనంలో కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ పండుగ‌లు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రుపుకోవాల‌ని, మ‌న‌లో స్నేహ సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయ‌ని వెల్ల‌డించారు. పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ముస్లిం కుటుంబాలు రంజాన్ ఆనందంగా జ‌రుపుకునేందుకు ఈ తోఫా పంపిణీ చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like