ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం…

బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్

MLA Gaddam Vinod:బెల్లంప‌ల్లి కాంగ్రెస్ నాయ‌కుడు ఎండీ ర‌ఫీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామ‌ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్ప‌ష్టం చేశారు. ర‌ఫీ కుటుంబ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పిల్లలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానన్నారు. వారి కుటుంబానికి  సాయం అందేలా ప్రభుత్వం తరఫున కూడా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పిల్లలకు ఎలాంటి అవసరం ఉన్నా ఎప్పుడైనా తమను సంప్రదించాలని, ఎల్లప్పుడూ కుటుంబానికి అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి, మున్సిపల్ వైస్ చైర్మన్ రగంశెట్టి సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like