ఏసీబీ వలలో ఎస్ఐ

లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కాడు ఓ ఎస్ఐ… రియల్ ఎస్టేట్ వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేసేందుకు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. నిర్మల్ జిల్లా మమడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై అశోక్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

బాధితుని వివరాల ప్రకారం, ఓ రియల్టర్‌కు సంబంధించిన వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేసేందుకు ఎస్సై అశోక్ ₹40,000 లంచం డిమాండ్ చేశాడు. బేరసారాల తర్వాత ₹20,000కు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. దీంతో విసిగిపోయిన బాధితుడు, ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారు పథకం ప్రకారం లంచం స్వీకరిస్తున్న సమయంలో ఎస్సైను పట్టుకున్నారు.

ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like