గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
ఆషాఢమాసం సందర్భంగా తాండూరు మండలం బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఇదే సమయంలో గంగమ్మకు పూజలు నిర్వహిస్తుంటారు. భక్తులు తమ కుటుంబాల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. కార్యక్రమంలో బుగ్గ రాజరాజేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ చైర్‌పర్సన్ మాసాడి శ్రీదేవి, గుగ్గిళ్ల సునీత, శ్రీరాములు, రాజబాబు, పలువురు భక్తులు పాల్గొన్నారు.