కోడలి గొంతు కోసి హత్య చేసిన మామ
ఓ మామ తన కోడలిని అత్యాంత కిరాతకంగా హతమార్చాడు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేటలో ఈ ఘటన జరిగింది., మూడు నెలల కిందట లింగన్నపేటకు చెందిన తిరుపతి కుమారుడు సాయికృష్ణతో అదే గ్రామానికి చెందిన సౌందర్య(19)తో ప్రేమ వివాహం జరిగింది. సౌందర్యను ప్రేమించి పెళ్లాడిన సాయికృష్ణ రెండు నెలలకే అత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతిచెందిన తర్వాత ఆదే గ్రామంలో ఉంటున్న తల్లి వద్ద సౌందర్య ఉంటోంది. ఈ రోజు ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లిన తిరుపతి.. కోడలు సౌందర్య గొంతుకోసి కిరాతకంగా హతమార్చాడు. తన కొడుకు మృతికి సౌందర్యే కారణం అని హత్య చేసినట్లు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.