విధులు సక్రమంగా నిర్వహించాలి
అంగన్వాడీ టీచర్లు విధులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా సంక్షేమాధికారి మాస ఉమాదేవి పిలుపునిచ్చారు. సోమవారం ఆమె బెల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు చేనేత చీరలు అందించారు. ఈ సందర్భంగా ఉమాదేవి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు,బాలింతలు,చిన్నారులకు పౌష్టికాహారం అందేలా కృషి చేయాలన్నారు. అన్ని రకాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు మమత, జ్యోతి, శుభ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.