తెలంగాణలో పెరిగిన అటవీ విస్తీర్ణం
తెలంగాణలో అటవీ విస్తీర్ణం పెరిగింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. తెలంగాణలో 632 చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం పెరిగిందని చెప్పారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021ను భూపేంద్ర యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను వెల్లడించారు. దేశంలో 80.9 మిలియన్ హెక్టార్లలో అడవుల విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. భారత్ లో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. ఏపీలో గరిష్ఠంగా 647చ.కి.మీ మేర అటవీ విస్తీర్ణం పెరగగా.. 632 చ.కి.మీ. విస్తీర్ణంతో ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఒడిశాలో 537 చ.కి.మీ అటవీ విస్తీర్ణం పెరిగిందని మంత్రి భూపేంద్ర యాదవ్ చెప్పారు.