ప్రాణహితలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు
మంచిర్యాల: ప్రాణహిత నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు సాయి , కృష్ణ , రాకేష్ గా గుర్తింపు. కోటపల్లి మండలం ఆల్గాం సమీపంలో ప్రాణహిత లో ఈతకు దిగి గల్లంతు. సంక్రాంతి సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన విద్యార్థులు.సరదాగా ఊరు పక్కనే ఉన్న ప్రాణహిత నదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఆరుగురు విద్యార్థుల్లో అంబాల రఘు, తగరం శ్రావణ్, గారే కార్తీక్ సురక్షితంగా నది ఒడ్డుకు చేరుకున్నారు. రాకేశ్ 1st ఇయర్ ఇంటర్, హన్మకొండ లో చదువుతున్నాడు. సాయి 9th క్లాస్, భీమారం స్కూల్లో చదువుతున్నాడు. వంశీకృష్ణ- 2nd ఇయర్ ఇంటర్, ప్రభుత్వ కళాశాల చెన్నూర్. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు.