వివాదస్పద భూమిలో పనులు అడ్డగింత
మంచిర్యాల : బీమారం మండలంలోని పోతన్ పల్లి శివారు ప్రాంతంలో వివాదస్పద భూమిలో మంగళవారం అటవీశాఖ అధికారులు స్ట్రెంచ్ వేస్తుండగా మండల కేంద్రానికి చెందిన పలువురు వ్యక్తులు అడ్డుకున్నారు. గొల్లవాగు ప్రాజెక్ట్ కింద 30 ఎకరాల భూమి ఉండటంతో దానిని చదును చేస్తూ వచ్చారు. మరికొందరు సైతం భూమిలో ఉన్న చెట్ల పొదలను చదును చేశారు. అటవీశాఖ సెక్షన్ అధికారి రామకృష్ణతో పాటు బీట్ అధికారి గోవిందు మరి కొంత మందితో అటవీశాఖ అధికారులు జేసీబీ సహాయంతో ట్రెంచ్ వేసేందుకు వెళ్లారు. దీంతో పలువురు స్థానికులు అటవీశాఖ అధికారులను అడ్డుకున్నారు. తమ భూముల్లోట్రెంచ్ ఎలా వేస్తారని నిలదీశారు. ఈ భూములకు సంబంధించి పట్టాలు కానీ ఆధారాలు కానీ ఏమైనా ఉంటే తెచ్చుకోవాలని కోరారు. సర్వే చేయించాలని స్థానికులు కోరడంతో రెవెన్యూ,ఇరిగేషన్,ఆటవీశాఖ అధికారులతో జాయింట్ సర్వే నిర్వహిస్తామని అటవీశాఖ అధికారులు హామీ ఇచ్చారు. సర్వే పూర్తి అయ్యేంత వరకు భూమి పైకి ఎవరు వెళ్లద్దని సూచించారు. ఇరిగేషన్ డీఈ ప్రవీణ్ కుమార్, ఏఈ శశంక్ రెడ్డి వివాదస్పద భూమి పరిశీలించారు. కార్యక్రమంలో జర్పుల రాజ్ కుమార్ నాయక్,పోడేటి రవి,కట్ట నాగరాజు తదితరులు ఉన్నారు.