గంటకు 19,406 స్మార్ట్ ఫోన్లు
కరోనా నేపథ్యంలో చాలా కంపెనీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. చాలా రంగాలు కరోనా దెబ్బకు విలవిలలాడిపోయాయి. చిప్‌ల కొరతతో కార్ల కంపెనీలు ఉత్పత్తి తగ్గిపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. 2020ని మించి అమ్మకాలు జరిగాయి. 2021లో భారత్‌లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 38 బిలియన్ డాలర్లను చేరుకుంది.
అంటే భారత కరెన్సీలో రూ. 2,83,666 కోట్లు. 2021లో ప్రతి గంటకు 19,406 మొబైల్ ఫోన్ల అమ్మకాలు జరిగాయి. 2021 మొత్తంమీద 16 కోట్లకు పైగా స్మార్ట్ఫోన్లను భారతీయులు కొనుగోలు చేశారు. భారత మార్కెట్లో షావోమీ 24 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకోగా, శాంసంగ్ 8 శాతం క్షీణతతో రెండో స్థానంలో నిలిచింది. రియల్మీ మూడో స్థానంలో నిలవగా, వివో, ఒప్పోలు నాలుగైదు స్థానాల్లో నిలిచాయి. మరో స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ కంపెనీ 2021లో 108 శాతం వృద్ధిని కనబరిచింది.