రుణ‌ప‌డి ఉంటాం..

-కేసీఆర్‌, బాల్క సుమ‌న్‌కు ధ‌న్య‌వాదాలు
-చెన్నూరులో భారీగా కృత‌జ్ఞ‌తా ర్యాలీ
-పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చిన రైతులు,నాయ‌కులు

మంచిర్యాల : చెన్నూరు ప్రాంతాన్ని స‌స్య‌శ్యామ‌లం చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్‌కు ఎల్ల‌ప్పుడు రుణ‌ప‌డి ఉంటామ‌ని ప‌లువురు రైతులు, నాయ‌కులు వెల్ల‌డించారు. చెన్నూరు లిఫ్ట్ ఇరిగేష‌న్ గురించి రాష్ట్ర బ‌డ్జెట్‌లో ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో చెన్నూరులో కృత‌జ్ఞ‌తా ర్యాలీ నిర్వ‌హించారు. టపాసులు కాలుస్తూ, స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు.ఈ సంద‌ర్భంగా ప‌లువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటికే రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, సకాలంలో ఎరువులు, ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు.

ఇప్పుడు చెన్నూరు ఎత్తిపోతల పథకం ద్వారా తమ బీళ్లకు నిరంతరాయంగా సాగునీరు అందుతుందని ఆనందం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం వెంట ఉంటామ‌ని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తామని నియోజకవర్గ రైతులు ముక్తకంఠంతో తెలిపారు. చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి ఎంతగానో కృషి చేసిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని చెన్నూరు, భీమారం, కోటపల్లి, జైపూర్, మందమర్రి, మండలాలు క్యాతనపల్లి, మందమర్రి, చెన్నూర్ మున్సిపాలిటీల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం నిర్వ‌హించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like