అగ్నిప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. రూ. 5 లక్ష‌లు ఎక్స్‌గ్రేషియా

సికింద్రాబాద్‌ బోయిగూడలోని ఓ టింబర్ డిపోలో ఈ తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. చెక్కలకు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున‌ ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారీగా మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో మంటలను అదుపు చేయడానికి ఫైర్‌ సిబ్బంది చాలా సేపు శ్రమించారు. ఎనిమిది ఫైర్ ఇంజన్ల సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడ్డ ఒకరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారిని బిట్టు (23), సికిందర్‌ (40), దినేశ్ (35), దామోదర్(27), చింటు(17), సికిందర్ (35), రాజేశ్ (25), రాజు (25), దీపక్ (26), పంకజ్ (26), గోలు (25)గా గుర్తించారు. ప్రేమ్ అనే యువకుడు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

డిపోలో మొత్తం 16 మంది ఉన్నట్లు సమాచారం.. ఇందులో 8 మంది కార్మికులు రోజువారీగా ఇందులోనే ఉంటున్నారు. ఇక నిన్న రాత్రే మరో ముగ్గురు బంధువులు వచ్చారు.. షార్ట్ సర్క్యూట్ కారణంగా తెల్లవారు జామున డిపోలో మంటలంటుకున్నాయి. దీంతో లోపలే ఉన్న ఓ సిలిండర్ బ్లాస్ట్ అయ్యి ప్రమాద తీవ్రత పెరిగింది. అందులోనూ అందరూ నిద్రలో ఉండటంతో మృతుల సంఖ్య కూడా పెరిగింది.. మృతులంతా బీహార్‌కు చెందిన వలస కార్మికులే.. ఇటు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు యజమాని సంపత్‌ను అరెస్ట్ చేశారు..

ముఖ్య‌మంత్రి దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌ట‌న‌
అగ్రి ప్ర‌మాదం గురించి తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు.. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో మరణాలు పెరిగాయని చెప్పారు. అగ్నిప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన బీహార్ వలస కార్మికుల పార్థివదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like