నిప్పుల్లో నడిచిన ఎమ్మెల్యే..
ఆ ఎమ్మెల్యే అందరికంటే డిఫరెంట్.. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తీర్చుతుంటారు. భక్తి విషయంలో కూడా ఎక్కడా వెనకడుగు వేయరు. ఆయనే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. గురువారం ఆయన నిప్పుల్లో నడిచారు. అంతర్గాం మండల కేంద్రంలో జరుగుతున్న నూకాంబిక అమ్మవారి జాతరలో ఆయన పాల్గొన్నారు. అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అగ్నిగుండంలో నడిచారు. అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.