యువతకు ఇది ఉద్యోగ నామ సంవత్సరం..
తెలుగు వాళ్లంతా ఈ ఉగాదిని శుభకృత్ నామ సంవత్సరంగా జరుపుకుంటే తెలంగాణ యువత ఉద్యోగ నామ సంవత్సరంగా చేసుకుంటున్నారని నిజమాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉగాది పచ్చడిలో ఉన్న తీపి, పులుపు, ఒగరులా జీవితంలో కూడా సుఖదుఃఖాల ఉంటాయన్నారు. ఈ ఉగాది ప్రతి వారి జీవితంలో మరింత శుభాన్ని కలిగించాలని కోరారు. సీఎం కేసీఆర్ 90 వేల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారన్నారు. అంతేకాకుండా ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న వారు టీషాట్ ఛానెల్‌ను సద్వినియోగం చేసుకోవాలని.. టీషాట్లో ఎంతో విలువలతో కూడిన సెలబస్ అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఉగ్యోగార్థులు టీషాట్ ద్వారా మరింత ముందుకు వెళ్లగలుగుతారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా పిల్లలను ప్రోత్సహించాలని ఆడబిడ్డలందరినీ కోరుతున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు.