గోదావరిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు
ఉగాది పండగ రోజు ఆ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతు అయ్యారు.. వివరాల్లోకి వెళితే..ములుగు జిల్లా రొయ్యూరు గ్రామంలో గ్రామ దేవత లక్ష్మీదేవరను గంగ స్నానానికి తీసుకెళతారు. ప్రతి ఏట ఇక్కడి ఆనవాయితీ. గ్రామ ప్రజలు అందరూ లక్ష్మీదేవర వెంబడి గోదావరికి వెళ్ళిన క్రమంలో ముగ్గురు యువకులు గోదారిలో గల్లంతయ్యారు. వారిలో ఆకుదారి సాయి వర్ధన్ 16సం, ఇంటర్ విద్యార్థి), దొంగిరి సందీప్ (13 సం,పదవ తరగతి),బెడికసతీష్ (17,ఇంటర్ విద్యార్థి) గల్లంతయ్యారు. వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతు అయిన విద్యార్థుల కోసం పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.