డిగ్రీ కళాశాల తరలిస్తే ఆందోళన
మంచిర్యాల : ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరలింపు ఉపసంహరించుకోవాలని రాజీవ్ రహదారి పై ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఊషణ అన్వేష్ మాట్లాడుతూ గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల చాలా సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులకు నిలయంగా మారిందని అన్నారు. కళాశాలలో పేద మధ్య తరగతి విద్యార్థులు చదువుకుంటారని తేలిపారు. డిగ్రీ కళాశాలను ప్రైవేట్ భవనానికి తరలించాలని చూడటం సరైంది కాదన్నారు.150 మంది మెడికల్ విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల భవనం ఎంపిక చేయడం సరికాదన్నారు. దీంతో వెయ్యి మంది విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు ఎదురుకొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుండి విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువు కుంటారని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు డిగ్రీ కళాశాల తరలింపు మానుకోవాలని కోరారు. లేకపోతే విద్యార్థులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ ఊషణ అన్వేష్, పెద్దపల్లి జిల్లా కన్వీనర్ అజయ్, SFS జిల్లా కన్వీనర్ రసురి ప్రవీణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణు భక్తుల రిషి, గోదావరిఖని నగర ఇంచార్జ్ పిడుగు సిద్దార్థ, నాయకులు వేల్పుల నితిన్, నాగ చంద్ర, వసీం, నాగరాజు, అరవింద్, సంజయ్, శివ, సందీప్, విక్రాంత్ ,పూజిత, తిరుమల, హర్ష ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.