సింగరేణి గనిలో ప్రమాదం.. కాంట్రాక్టు కార్మికుడి మృతి
శాంతిఖని అండర్ గ్రౌండ్ గనిలో కాంట్రాక్టు కార్మికుడు మరణించాడు. కందుల లక్ష్మీనారాయణ అనే కాంట్రాక్టు కార్మికుడు పనిలో ఉండగా బెల్ట్ ప్రాంతంలో కింద పడి మరణించాడని చెప్తున్నారు. డ్యూటీలో ఫిట్స్ వచ్చి వైద్య మందించటానికి సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడని గని అధికారులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
సింగరేణి నిబంధనలకు విరుద్ధంగా అండర్ గ్రౌండ్ లో అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ కాంట్రాక్టు కార్మికులతో ప్రమాదకరమైన పనిస్థలాల్లో పనులుచేయించుకుంటున్నదని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (IFTU) నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కందుల లక్ష్మి నారాయణ మృతికి సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లక్ష్మీనారాయణ మృతిని గని ప్రమాదంగా గుర్తించాలని, సింగరేణి యాజమాన్యం అతని కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.