రూ. 1,658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కం

-ఆమోదించిన రాష్ట్ర మంత్రివ‌ర్గం
-ఆనందం వ్య‌క్తం చేస్తున్న చెన్నూరు రైతులు
-ముఖ్య‌మంత్రి మేలు మ‌రువ‌లేమ‌న్న ప్ర‌భుత్వ విప్‌

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి రాష్ట్ర మంత్రివ‌ర్గం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేశారు. ఈ పథకానికి 1,658 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు వెల్ల‌డించారు. ఈ ప‌థ‌కం ద్వారా చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాలు 103 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందనుంది. ‘చెన్నూరు ఎత్తిపోతల పథకానికి’ కేబినెట్ ఆమోదం తెలిపింది. 10 టిఎంసీల గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టునుండి ఈ పథకానికి వినియోగించనున్నారు.

చెన్నూర్ నియోజకవర్గం చుట్టూ నీరు పారుతున్న సాగు నీరు లేక ఇక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాగు నీటి సౌకర్యం లేకపోవడంతో వేలాది ఎకరాల పొలాలు బీళ్లుగా మారాయి. ఇక్కడి పరిస్థితులు గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు అందించేందుకు సర్వే చేపట్టాలని జీవో విడుదల చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి 1.35 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ కృషి చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నియోజకవర్గంలోని 1.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఫిబ్రవరి 10న నియోజకవర్గానికి సాగునీటి కల్పన కోసం సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాగునీటి సరఫరా కోసం సర్వే పను లు చేపట్టాలని ప్రభుత్వం అనుమతులిస్తూ జీవో జారీ చేసింది. పంప్ హౌజ్, కాలువలు, డిస్ట్రిబ్యూటరీ, 3 లిఫ్ట నిర్మాణానికి నీటి పారుదల శాఖ రూ.6.88 కోట్ల నిధులు మంజూరు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నియోజకవ ర్గంలోని 5 మండలాలకు సాగునీరు అందనుండడంతో ఆయా మండలాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సా గునీరు అందించే లిఫ్ట నిర్మాణ సర్వే పనులను ఇటీవల ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రారంభించారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల వద్ద లిఫ్ట్ల నిర్మాణం కోసం సర్వే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇరిగేషన్ అ ధికారులు డ్రోన్ కెమెరాలతో సర్వే పనులు చేపడుతున్నా. రు. గడువు కంటే ముందుగానే ఈనెలాఖరు వరకు సర్వే: పనులు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఐదు మండలాలకు…

సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల వద్ద మూడు లిఫ్ట్ లు నిర్మించి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సా గు నీరు అందించనున్నారు. చెన్నూర్, కోటపల్లి, భీమారం , జైపూర్, మందమర్రి మండలాలు కాళేశ్వరం నీటితో స స్యశ్యామలం కానున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేర కు ప్రభుత్వ విప్ ఇరిగేషన్ అధికారులతోపాటు ముఖ్య మంత్రిని కలిసి లిఫ్టు నిర్మాణానికి అనుమతులు సాధిం చారు. చెన్నూర్ లిఫ్ట్ పథకం ద్వారా నియోజకవర్గంలోని 102 గ్రామ పంచాయతీలలోని 367 చెరువులను నింపి 1.35 లక్షల ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించనున్నారు.

చేసేదే చెప్తాం… చెప్పేది చేస్తాం..
తాము చేసేది చెప్తామ‌ని, చెప్పింది ఖ‌చ్చితంగా చేస్తామ‌ని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. త‌మ ప్ర‌భుత్వం నిత్యం రైతుల కోసం ఆలోచిస్తుంద‌ని వెల్ల‌డించారు. ఇక్క‌డ గ‌త పాల‌కుల నిర్ల‌క్ష్యం మూలంగా రైతులు నానా ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారి క‌ష్టాలు తీర్చేందుకు, క‌న్నీళ్లు తుడిచేందుకు రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సహకారంతో ప‌నులు పూర్త‌య్యి నిధులు కూడా మంజూరు అవుతున్నాయి. ఈ చెన్నూర్ లిఫ్ట్ స్కీం ద్వారా నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. ఇది చెన్నూరు చ‌రిత్ర‌లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించాల్సిన రోజు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like