ప‌క్క‌దారి ప‌డుతున్న సింగ‌రేణి శ్ర‌మ‌శ‌క్తి

-TBGKS నేత ఇంటికి సింగరేణి పైపులు
-బ‌య‌ట‌కు పొక్క‌డంతో న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు
-ఆ నేత ఇంట్లో మ‌రింత సింగ‌రేణి సామ‌గ్రి

మంచిర్యాల : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేత ఇంటికి అక్రమంగా పైపులు తరలించడం కలకలం సృష్టించింది. ఈ వ్యవహారం బయటికి రావటంతో ఆ నేత నష్ట నివారణ చర్యలు చేపట్టారు.. వివరాల్లోకి వెళితే.. బెల్లంపల్లి ఏరియా శాంతిఖని నుండి బెల్లంపల్లి టూ టౌన్ పోలీసు స్టేషన్ పేరుతో 38 సింగరేణి పైపులు తరలించారు. అయితే అవి పోలీస్ స్టేషన్ కాకుండా TBGKS నేత ఇంటికి తరలించారు. ఆ వ్యహారం కాస్త బయటికి పొక్కింది. దీంతో ఆ నేత ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నారు. వెంటనే తేరుకుని పొలీస్ స్టేషన్ 34 పైపులు తరలించారు. మరోవైపు సింగరేణి విజిలెన్స్ తనిఖీల్లో ఈ నేత ఇంట్లో సింగరేణి సామగ్రి దొరికినట్లు సమాచారం. దీంతో తనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పై నుండి ఒత్తిడి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఆ పైపులకు సంబంధించి పోలీసులకు సంబంధం లేకపోవడంతో వారిని సైతం మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఇక అధికారులు ఈ విష‌యంలో నోరు మెద‌డం లేదు. కార్మికులు చిన్న త‌ప్పు చేస్తేనే చార్జీషీట్లు, స‌స్పెండ్ చేసే అధికారులు మ‌రి ఈ విష‌యంలో ఏం చేస్తార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఆ నేత‌పై చ‌ర్య‌లు తీసుకుంటారా..? లేక ఎప్ప‌టిలాగానే ఆ కార్మిక నేత చేసిన త‌ప్పు క‌ప్పి పుచ్చి ఆ నేత సేవ‌లో త‌రిస్తారా..? వేచి చూడాల్సిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like