చంచల్గూడ జైలుకు రాహుల్ గాంధీ
తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్ రెండో రోజు కొనసాగుతోంది. నిన్న వరంగల్ సభ ముగిశాక హైదరాబాద్ చేరుకున్న ఆయన తాజ్ కృష్ణలో బస చేశారు. తెలంగాణ ఉద్యమ నేతలతో సమావేశం అవుతారు. 11 గంటల 45 నిమిషాలకు సంజీవయ్య పార్కు వెళ్లి దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య విగ్రహానికి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు చంచల్ గూడ జైలులో ఉన్న NSUI నేతలను కలిసేందుకు వెళతారు. ఒకటిన్నరకు గాంధీభవన్ లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలతో సమావేశమై.. పార్టీ అంశాలపై చర్చిస్తారు. 2 గంటల 45 నిమిషాలకు మెంబర్షిప్ కో ఆర్డినేటర్లతో భేటీ అవుతారు. సాయంత్రం ఢిల్లీ బయల్దేరి వెళతారు.