శభాష్..
-ఇదే స్ఫూర్తితో పని చేయండి
-ఏఐసీసీ సభ్యుడు ప్రేమ్ సాగర్ రావు, సురేఖని అభినందించిన రాహుల్ గాంధీ

మంచిర్యాల :ఇదే స్ఫూర్తితో పని చేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని ఏఐసీసీ సభ్యుడు ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖని రాహుల్ గాంధీ అభినందించారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా శనివారం గాంధీ భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో వారితో పాటు మంచిర్యాల జిల్లా నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదులో మంచిర్యాల నియోజకవర్గం లక్షా ముప్పై రెండు వేల పైచిలుకు సభ్యత్వ నమోదు చేసి, దేశంలోనే ముందు స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలని వారికి మార్గ నిర్దేశం చేశారు. ప్రేమ్ సాగర్ రావు, సురేఖతో పాటు సభ్యత్వ నమోదులో మంచిర్యాల నియోజకవర్గంలో చురుకుగా వ్యవరించిన సూరిమిల్ల వేణు, పుట్ట యశోద, ఖాలీద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పింగిలి రమేష్,తోట రవి, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్,బండారి సుధాకర్ లను కూడా రాహుల్ గాంధీ అభినందించారు.