జాతీయ సమైక్యతా శిబిరానికి సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని
మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వ క్రీడల మంత్రిత్వ శాఖ, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా శిబిరానికి దొమ్మటి జ్యోత్స్న ఎంపికైంది. కాకతీయ విశ్వవిద్యాలయం తరపున మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్న తనని ఎంపిక చేశారు. ఈ నెల 18 నుంచి 24వరకు తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ లోని భారతీయార్ విశ్వవిద్యాలయంలో అన్ని రాష్ట్రాల నుంచి పాల్గనబోయే సుమారు 200 మంది వాలంటీర్లలో జ్యోత్స్న ఎంపికైంది. కళాశాల కరస్పాండెంట్ హీరాలాల్ ఉపాద్యాయ జ్యోత్స్నకు పుష్పగుచ్చం అందించి అభినందించారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన 11 మంది వాలంటీర్లలో తమ కళాశాల విద్యార్థిని ఎంపిక కావడం మాకు,మా కళాశాల గర్వించదగ్గ విషయం అని హీరాలాల్ ఉపాద్యాయ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ యం.తిరుపతి, అధ్యాపక బృందం మహంకాళి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.