కార్మికుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌మే మా ధ్యేయం

టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి

సింగ‌రేణి కార్మికుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ కోసం టీబీజీకేఎస్ ఎల్ల‌వేళ‌లా ప‌నిచేస్తుంద‌ని యూనియన్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి అన్నారు. ఆర్జీ 2 ఓసీపీ త్రీ కృషిభవన్ గేట్ మీటింగ్ ఆయ‌న ముఖ్యఅతిథిగా హాజర‌య్యారు. ఏరియా ఉపాధ్యక్షుడు ఆయిలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ గతంలో గుర్తింపు కార్మిక సంఘాలుగా జాతీయ కార్మిక సంఘాలు సింగరేణి కార్మికుల హక్కులను పోగొట్టాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వచ్చిన తర్వాత మాత్రమే ఒక్క ఆందోళన కార్యక్రమం నిర్వహించకుండ 60కి పైగా హక్కులు సాధించామ‌ని గుర్తు చేశారు.

కారుణ్య నియామకాల పేరుమీద పదివేల మందికి ఉద్యోగాలు కల్పించడం ద‌గ్గ‌ర నుంచి వేలాది మందికి నోటిఫికేష‌న్ల ద్వారా కొత్త‌గా రిక్రూట్ మెంట్ చేయించిన ఘ‌న‌త తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘానిదేన‌న్నారు. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో అడ్డుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలోనే సింగరేణికి ఆ నాలుగు బ్లాగులు దక్కే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కోల్ ఇండియాలో బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీక‌ర‌ణ అడ్డుకోలేని సంఘాలు ఇక్క‌డ టీబీజీకేఎస్‌పై విమ‌ర్శించడం సిగ్గుచేట‌న్నారు. సింగరేణి పరిరక్షణకు టీబీజీకేఎస్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా 50 మంది వివిధ యూనియన్ల కార్యకర్తలు టీబీజీకేఎస్ చేరగా మిర్యాల రాజి రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర నాయకులు దేవావెంకటేశం,సత్యనారాయణ రెడ్డి,ఎటంకృష్ణ,జీఎం కమిటీ స‌భ్యులుశంకర్ నాయక్, చెరుకు ప్రభాకర్ రెడ్డి,సత్యం దశరథం,పైడిపెల్లి ప్రభాకర్,కరక శ్రీనివాస్,బేతి చంద్రయ్య,బొద్దుల నరసయ్య,సూర్యశ్యామ్,సమ్మయ్య,మామిడితిరుపతి,మల్లయ్య, సంజీవ్,రాజమౌళి,చంద్రమౌళి పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like