బ్రేకింగ్ న్యూస్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గోదావరిఖని గంగానగర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై నుండి వెళ్తున్న వ్యక్తిని వెనక నుండి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న నేరెళ్ళ కొమురయ్య అక్కడిక్కడే మరణించాడు. ఆయన శ్రీరాంపూర్ కాలనీ సుందరయ్య నగర్ నస్పూర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.