ఇదేనా కార్మిక సంక్షేమం…?
-గోలేటీ ఆసుపత్రిలో కనీసం తాగునీరు లేదు
-టీబీజీకేఎస్ నేతలు కార్మికులకు అన్యాయం చేస్తున్నారు
-HMS నేతల ఆగ్రహం
మంచిర్యాల : సంస్థకు వందల కోట్లు లాభాలు వస్తున్నాయని, కార్మికుల సంక్షేమం కోసం కోట్లలో ఖర్చు చేస్తున్నామని చెబుతున్న యాజమాన్యం వాస్తవానికి కనీసం మంచినీరు కూడా ఇవ్వడం లేదని HMS నేతలు మండిపడ్డారు. బెల్లంపల్లి ఏరియా గోలేటి హాస్పిటల్ వైద్యాధికారి స్టాలిన్ బాబుకు వినతి పత్రం అందించి మాట్లాడారు. వైద్యానికి వచ్చే కార్మిక కుటుంబాలు, సిబ్బంది తాగడానికి మంచినీరు లేని దౌర్భగ్య పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ వాటర్ ప్లాంట్ నిర్మించి మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో వందల కోట్ల లాభాలు వస్తున్నా.. యాజమాన్యం కార్మికులకు మంచినీటి సౌకర్యం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న వాటర్ ప్లాంట్ నిర్మించడానికి యాజమాన్యం ఎందుకు పట్టించుకోవడం లేదో అర్ధం కావడం లేదన్నారు. ఇక్కడ సరైన వైద్య సదుపాయాలు కూడా లేవని, రెఫరల్ రూపంలో కార్పొరేట్ ఆసుపత్రులకు ఏటా కోట్లాది రూపాయలు చెల్లిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. TBGKS యూనియన్ నాయకులు పైరవీలు, ఫ్రీ మాస్టర్స్ కు ఆశపడి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం సింగరేణి హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గా ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షుడు పతెంరాజబాబు, ఫిట్ సెక్రటరీస్ ఎం.శ్రీనివాస్, ఎండీ.వసీమ్, ఏరియా సెక్రటరీ SK.ఇనూస్, MD.అబుల్ ఘనీ తదితరులు పాల్గొన్నారు