మావి పోరాటాలు… వాళ్లవి పైరవీలు
-బాధితుడు ఫిర్యాదు చేస్తే ఎంతటి వారైనా వదలం
-మీరు నాయకులే కదా..? మీకు బాధ్యత లేదా..?
-కేవలం మాపైనే నిందలు ఎందుకు..?
-ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎండీ.అక్బర్ అలీ
మంచిర్యాల : మందమర్రి ఏరియా TBGKS నేత అక్రమ సంబంధం వ్యవహారంలో బాధితుడు తమ వద్దకు రాలేదని, మాకు ఫిర్యాదు చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎండీ.అక్బర్ అలీ స్పష్టం చేశారు. ఆయన మందమర్రి ఏరియా RK1A గనిపై గేట్ మీటింగ్‌లో కార్మికులతో మాట్లాడారు. కొన్ని సంఘాల నాయకులు కేవలం ఎర్ర జెండా నాయకులు మాత్రమే ఈ విషయం లో స్పందించాలని, అతని పేరు చెప్పాలని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో ఏరియా హాస్పిటల్ రామకృష్ణపూర్ లో జరిగిన సంఘటన ఆధారాలతో బయటపెట్టినా,యాజమాన్యం అక్రమార్కులను శిక్షించలేదన్నారు. పైగా వాస్తవాలను బయటపెట్టిన ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ ని వేరే ఏరియా కి బదిలీ చేసి, తప్పు చేసిన వారికే సహకరంచిందని, ఈ విషయం లో ఏ సంఘం నోరు విప్పలేదని దుయ్యబట్టారు. ఏఐటీయూసీ పోరాటాలు చేస్తుంటే, వీళ్ళు పైరవీలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాలి వార్తలు ప్రచారం చేసే INTUC నాయకులు, వాస్తవాలు తెలిస్తే బహిరంగంగా ప్రచారం చేయాలి కానీ, ఒకరి మీద ఆధారపడటం ఏమిటని అక్బర్ అలీ ప్రశ్నించారు. సింగరేణి యాజమాన్యం లాభాల వాటా వెంటనే ప్రకటించి కార్మికులకు అందజేయాలన్నారు.. సింగరేణి సంస్థ డబ్బుని కార్మికుల సంక్షేమం గురించి ఖర్చు పెట్టకుండా, వెయ్యి కోట్లు ఇతర ప్రాంతాలకు ఖర్చు పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. 190 మస్టర్లు పూర్తి చేసిన బదిలీ వర్కర్లకి జనరల్ మజ్దూర్ ఇవ్వాలని, RK1ఏ గని మూసి వేసే పరిస్థితుల్లో కార్మికులు కోరుకున్న చోటుకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షుడు ఇప్పకాయల లింగయ్య, RK 1A పిట్ సెక్రటరీ సురమళ్ళ వినయ్ కుమార్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ గోవిందులరమేష్, గాజులరాయమల్లు, సుంకరిగట్టయ్య, మేడం బాల్ కోటి రెడ్డి,మారం రాజు,చంద్రకాని రమేష్,సిలివేరుహరీష్, మందరమేష్, రామక్రిష్ణ, కోలబానయ్య, అక్కలసతీష్, ఎనగందుల శ్రీకాంత్, పూదరి రాజేష్, శ్రీధర్, నూనె రాజశేఖర్ పాల్గొన్నారు..