బోనమెత్తి.. పూజ చేసి..
-గాంధారి మైసమ్మ, మదనపోషమ్మకు మొక్కులు చెల్లించిన బాల్క
-ప్రజలంతా చల్లగా ఉండాలని కోరుకున్న:సుమన్

ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ బోనమెత్తారు. గాంధారి మైసమ్మ ఆషాడమాస బోనాల జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనంతో ర్యాలీగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుతూ అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారి దయతోనే అందరం చల్లగా ఉన్నామని, ఆమె దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని స్పష్టం చేశారు. అందరినీ చల్లగా చూడమని మొక్కుకున్నట్లు వెల్లడించారు. తర్వాత చెన్నూరు మదనపోషమ్మ ఆలయాన్ని కూడా సందర్శించారు. చెన్నూర్ కొత్త బస్టాండ్ నుండి మదన పోచమ్మ ఆలయం వరకు బోనాలతో ర్యాలీగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించారు.