ఆయనవి శిఖండి రాజకీయాలు..
-2004 ముందు నీ అడ్రస్ ఎక్కడ...?
-నిన్ను మంత్రిని చేసింది కేసీఆర్ కాదా..?
-నువ్వు ఓ చెల్లని రూపాయి..
-బీజేపీలో ఆయనది బానిస బతుకు
-ఈటెల రాజేందర్‌పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఫైర్

హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వి శిఖండి రాజకీయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండి పడ్డారు. టీఆర్ఎస్ ఎల్పీలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2004కు ముందు ఈటెల అడ్రస్ ఎక్కడ..? ఈటెలను మంత్రి చేసింది కేసీఆర్ కదా? అని సుమన్ ప్రశ్నించారు. ఆయనో విశ్వాస ఘాతకుడని ధ్వజమెత్తారు. తిన్నింటి వాసాలను లెక్కబెట్టారని మండిపడ్డారు. ఆరోగ్య మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ అవినీతికి పాల్పడ్డాడని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో హుజురాబాద్‌లో రాజేందర్ ఓటమి ఖాయమన్నారు. అందుకే గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారని ధ్వజమెత్తారు. ఈటెల కేసీఆర్‌పై పోటీ చేసే సిపాయా? అని ప్రశ్నించారు. ఆయన ఓ చెల్లని రూపాయి అని విమర్శించారు. బీజేపీలో ఈటెలది బానిస బతుకు అని తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై పై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె బీజేపీ కండువా కప్పుకుని రాజకీయాలు మాట్లాడితే మంచిదన్నారరు. క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడటానికి గవర్నర్ ఏమైనా శాస్త్రవేత్తనా అని సుమన్ ప్రశ్నించారు.