బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంజయ్ కిరణ్ మృతి చెందారు. వరంగల్ రూరల్ జిల్లా ఎల్గూరు రంగం పేటకు చెందిన సంజయ్ కిరణ్ అనారోగ్యంతో మరణించాడు. ఆ విద్యార్థి కొద్ది రోజులుగా జీర్ణకోశ వ్యాధితో బాధపడుతున్నారు. గతంలో కిరణ్ హైదరాబాద్‌లో చికిత్స పొందారు. ఇటీవల ట్రిపుల్ ఐటీకి సెలవులు ప్రకటించడంతో ఇంటికి వెళ్లాడు. మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం ఎల్గూరు రంగంపేటకు బాడీ తరలించారు.