దిగబడిన కలెక్టర్ వాహనం
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరీ వాహనం బురదలో దిగబడింది. గురువారం ఆమె పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా నెన్నల మండలంలో పర్యటించారు. ఘన్పూర్, గొల్లపల్లి గ్రామాలకు వెళ్లారు. ఘన్పూర్ గ్రామానికి చేరుకున్న ఆమె స్మశాన వాటిక పరిశీలిచేందుకు వెళ్తుండగా చేను దిగి రోడ్డు ఎక్కుతున్న సమయంలో ఆమె వాహనం అక్కడ దిగబడింది. దీంతో కలెక్టర్ నడుచుకుంటూ వెళ్లిపోయారు. సర్పంచ్ భర్త సాగర్ గౌడ్, కలెక్టర్ భద్రతా సిబ్బంది, గ్రామస్తులు కలిసి ఆ వాహనాన్ని నెట్టడంతో తిరిగి రోడ్డుపైకి వచ్చింది.