బ్రేకింగ్.. వీఆర్ఏ ఆత్మహత్యయత్నం
ఆరు రోజులుగా ఆందోళనా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఓ వీఆర్ఏ ఆత్మయత్నాయత్నం చేశారు. కొమురంభీం జిల్లా పెంచికల్‌పేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమకు విధులు కేటాయించాని వీఆర్ఏ లు ఆందోళన చేస్తున్నారు. తాము ప్రభుత్వానికి ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఎల్లూరు పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న వి.ఆర్.ఏ. తిరుపతి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. మిగతా వారంతా ఆయనను అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడం తమను తీవ్రంగా బాధిస్తోందని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టినా, ప్రభుత్వం స్పందించక పోవడంతో, నిరవధిక సమ్మె చేస్తున్నామని వెల్లడించారు.