ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపూరావు అరెస్టు
Basara IIIT విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం తిండి సైతం మానేసి విద్యార్థులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటామని ఎంపీ ప్రకటించారు. లోకేశ్వరం మండలం మన్మథ దగ్గర ఎంపీ సోయంబాపూరావు వాహనాన్ని అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లే మార్గంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దిల్వార్ పూర్ టోల్ ప్లాజాలో దగ్గర వాహనాల తనిఖీలు చేస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ వైపునకు రాజకీయ పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. బాసరలో సైతం ట్రిపుల్ ఐటీ చుట్టూ మూడంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతోంది.