మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని HMS పాదయాత్ర

వరద బాధితులను రక్షించేందుకు వెళ్లి మరణించిన సింగరేణి రెస్య్కూ సిబ్బంది కుటుంబాలకు న్యాయం చేయాలని సోమవారం నుంచి HMS యూనియన్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించానున్నారు. ఈ మేరకు పాదయాత్ర పోస్టర్ విడుదల చేశారు. దహెగాం మండలంపెసరకుంట వద్ద వాగులో పడి మరణించిన చెలిక సతీష్, అంబాల రాములు కుటుంబాలకు సింగరేణి యాజమాన్యంచ ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వారికి న్యాయం చేయాలని కోరుతూ ఆగస్టు 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు ఈ పాదయాత్ర నిర్వహిస్తామని వెల్లడించారు. దహెగాం మండలం పెసరికుంట పెద్దవాగు నుంచి శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కార్యాలయం వరకు 100 కిలోమీటర్ల ఈ యాత్ర నిర్వహిస్తామన్నారు. ఈ పాదయాత్ర విజయవంతం చేయాలని HMS నేతలు కోరారు. కార్యక్రమంలో HMS బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పతెం రాజబాబు, కేంద్ర ఉపాధ్యక్షుడు MD.వాజీర్, కేంద్ర కమిటీ కార్యదర్శి శంకర్, ఏరియా కార్యదర్శి M.శివారెడ్డి, ఇనూస్, గౌస్ పాల్గొన్నారు.