పరీక్షా కేంద్రానికి అనుమతించలేదని క్రిమిసంహారక మందు తాగింది

పరీక్షా కేంద్రానికి ఆలస్యం అయ్యిందని లోపలికి అనుమతించకపోవడటంతో ఓ విద్యార్థిని క్రిమిసంహారక మందు తాగింది.వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని జాటోత్ సమీరా పరీక్ష కేంద్రానికి వచ్చారు. అప్పటికే ఆలస్యం కావడంతో లోపలికి అనుమతించ లేదు. దీంతో సమీర క్రిమిసంహారక మందు తాగింది. దీంతో ద్విచక్ర వాహనం పై మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమీరా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.