గవర్నర్ వద్దకు త్రిబుల్ ఐటీ పంచాయతీ
కాసేపట్లో గవర్నర్ ను కలవనున్న విద్యార్థులు
కొద్దిరోజులుగా తమ సమస్యలపై ఆందోళన చేస్తున్న త్రిబుల్ ఐటీ విద్యార్థులు గవర్నర్ కల్వనున్నారు. కాసేపట్లో గవర్నర్ దగ్గరకు వెళ్లి తమ సమస్యలను వివరించనున్నారు. త్రిబుల్ ఐటీ త్రిబుల్ ఐటీ లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు కొద్ది రోజులుగా శాంతియుత ఆందోళన నిర్వహిస్తున్నారు. భోజనం సైతం మానేసి బయట నుంచి ఆందోళన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మెస్ కాంట్రాక్టర్ల మార్పుతో సహా పలు డిమాండ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఇంచార్జి వీసీ కొన్ని చర్యలు తీసుకున్నామని ప్రకటించినా విద్యార్థులు శాంతించడటం లేదు. తమ డిమాండ్ల పై సరైన స్పందన రాకపోవడంతో గవర్నర్ కలిసేందుకు విద్యార్థులు నిర్ణయం తీసుకున్నారు 10 గంటలకి గవర్నర్ తమిళ్ సై తో విద్యార్థులు భేటీ అవుతారు.