గంజాయి రవాణా చేస్తున్న యువతి అరెస్టు
-అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
-నాలుగు కిలోల గంజాయి, సెల్ ఫోన్ స్వాధీనం
గంజాయి రవాణా చేస్తున్న యువతిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ ఆకుల అశోక్, ఎస్ఐ ఆది మధుసూదన్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. మంచిర్యాల బస్టాండ్‌లో ఓ యువతి అనుమానస్పదంగా కనిపించడంతో ఆమె వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేశారు. అందులో సుమారు నాలుగు కిలోల గంజాయి దొరికింది. బల్లార్షాకు చెందిన పూజ ఆకాష్ అనే ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి మంచిర్యాలలో అమ్మేందుకు తీసుకువచ్చింది. ఆమె వద్ద దొరికిన గంజాయి, నిందితురాలిని మంచిర్యాల పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. దాడుల్లో పోలీసులు శేఖర్, తిరుపతి పాల్గొన్నారు.