గురుకుల పాఠశాల విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని గురుకుల పాఠశాల విద్యార్థులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో ఉన్న16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వారికి ఫుడ్ పాయిజన్ అయినట్టుగా అనుమానిస్తున్నారు. వారిలో 14 మంది పరిస్థితి నిలకడగా ఉండగా, మరో ఇద్దరి పరిస్థితి కొంచం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.గురువారం సాయంత్రం టీ, స్నాక్స్ తిన్న తర్వాత విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.