25 వేల మంది.. జాతీయ పతాకాలతో ర్యాలీ

-ప్ర‌జ‌ల్లో జాతీయ భావం పెంపొందించ‌డ‌మే లక్ష్యం
-బెల్లంప‌ల్లి ఏసీపీ ఎడ్ల మ‌హేష్

ప్ర‌జ‌ల్లో జాతీయభావం పెంపొందించ‌డ‌మే ల‌క్ష్యంగా బెల్లంప‌ల్లిలో 25వేల మందితో జాతీయ‌ప‌తాకాలు చేత‌బూని మ‌హార్యాలీ నిర్వ‌హిస్తున్న‌ట్లు బెల్లంప‌ల్లి ఏసీపీ ఎడ్ల మ‌హేష్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న మంగ‌ళ‌వారం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంద‌ని వెల్ల‌డించారు.

దీనిలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలో 13వ తేదీ (శనివారం) ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామని చెప్పారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బెల్లంపల్లిలోని NO-2 గ్రౌండులో ఉదయం 9గంటలకు 25,000 మందితో సామూహిక జాతీయ గీతాలాపన నిర్వ‌హిస్తామ‌న్నారు. విద్యార్థిని, విద్యార్థులు, మహిళలు, యువకులు విభిన్న స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొంటార‌ని తెలిపారు. అనంతరం NO-2 గ్రౌండ్ నుంచి కొత్త బస్టాండ్ వరకు తిరిగి అక్క‌డి నుంచి మ‌హార్యాలీ నిర్వ‌హిస్తామ‌న్నారు.

స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల వేషధారణలతో ప్రతి ఒక్కరూ జాతీయ జెండా చేతబూని ర్యాలీలో పాల్గొంటార‌ని స్ప‌ష్టం చేశారు. విద్యార్థిని, విద్యార్థులకు స్ఫూర్తి కలిగించే విభిన్న రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు ప్ర‌తినిధులు సైతం హాజ‌ర‌వుతార‌ని వెల్లడించారు. ప్రజలందరిలో జాతీయతా భావాన్ని పెంపొందించడానికి, స్వాతంత్య్ర స్పూర్తి ర‌గిలించ‌డానికి, బెల్లంపల్లి పట్టణ కీర్తిని న‌లుదిశ‌లా తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like