డిలీట్ ఆప్షన్ సమయం పెంచిన వాట్సప్
వాట్సప్ వినియోగదారులకు దగ్గర అయ్యేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తుంది. ఉన్న ఫీచర్లను సైతం Update చేస్తుంది. తాజాగా వాట్సాప్ ‘Delete For Everyone’ ఫీచర్లో కొత్త అప్డేట్ తీసుకువచ్చింది. దాంతో యూజర్లు రెండు రోజుల కిందట పంపిన మెసేజ్‌లను కూడా డిలీట్ చేసుకోవడం సాధ్యమవుతుంది. ఇంతకుముందు గంట కిందట పంపిన మెసేజ్‌లు మాత్రమే అందరికీ డిలీట్ చేయడం కుదరేది. ఈ సమయాన్ని ఇప్పుడు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్ని వాట్సాప్ Tweet ద్వారా వెల్లడించింది. ఇకనుంచి యూజర్లు ఒక వ్యక్తికి లేదా గ్రూప్ చాట్‌కు పంపిన మెసేజ్‌ను రెండు రోజుల తర్వాత కూడా అన్‌సెండ్ చేయవచ్చని పేర్కొంది. ఈ ఫీచర్‌ను ఇంకా పొందని వారు గూగుల్ ప్లేస్టోర్‌లో తమ యాప్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ టైమ్ లిమిట్‌ను బీటా టెస్టర్లకు కొన్ని వారాల క్రితమే తీసుకువచ్చింది. మొదటగా ఈ సమయాన్ని ఏడురోజుల వరకు పొడిగించాలని భావించింది. కానీ దీనివల్ల ప్రైవసీకి భంగం వాటిల్లే అవకాశం ఉంటుందని రెండు రోజుల వరకు పొడిగించింది.
కొత్త అప్డేట్తో వాట్సాప్ మరింత మెరుగ్గా మారుతుందని పలువురు టెక్కీలు చెబుతున్నారు. ఇది చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు. దీనివల్ల ప్రైవసీ అనేది చాలా పెరుగుతుంది.యూజర్లు తమ ఆన్లైన్ స్టేటస్‌ను కాంటాక్ట్‌ల నుంచి దాచడం, యూజర్లందరికీ తెలియజేయకుండా గ్రూప్ నుంచి లెఫ్ట్ కావడం, వ్యూ వన్స్ మెసేజ్‌ల్లో పంపిన ఫొటోలు స్క్రీన్షాట్లను తీసుకోకుండా ఆపేయడం వంటి వివిధ ప్రైవసీ ఫీచర్లను వాట్సాప్ తీసుకువస్తుందని వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ ఇటీవల ట్వీట్ చేశారు.