పంచాయ‌తీ కార్యాల‌యంలోనే కొట్టుకున్న‌రు

-సర్పంచ్ భర్త, కార్యదర్శికి మధ్య గొడవ
-ఒకరిపై ఒకరు దాడి, ఇరువురికి గాయాలు

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామపంచాయతీలో స‌ర్పంచ్ భ‌ర్త అల్గునూరి ర‌వి, కార్య‌ద‌ర్శి గంగారం ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకున్నారు.. సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే…

గ్రామ‌పంచాయ‌తీ ప‌నుల బిల్లుల‌కు సంబంధించి కొంత కాలంగా స‌ర్పంచ్ సులోచ‌న‌, పంచాయతీ కార్యదర్శి గంగారాం మధ్య కొంత కాలంగా విభేదాలు కొన‌సాగుతున్నాయి. అవి కాస్తా చిలికి చిలికి గాలివాన‌లా మారాయి. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులకు సంబంధించిన చెక్కులపై సంతకాలు చేయడంలో సర్పంచ్ ఇబ్బంది పెడుతున్నారని కార్యదర్శి ఆరోపిస్తుండగా, పంచాయతీ కార్యదర్శి గంగారాం తమను ఇబ్బందులకు గురి చేస్తున్నార‌ని స‌ర్పంచ్ సులోచ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా, శ‌నివారం ఇదే విష‌యంలో గ్రామ పంచాయ‌తీలో వాగ్వావాదం చోటు చేసుకుంది. మ‌ధ్య‌లో స‌ర్పంచ్ భ‌ర్త ర‌వి జోక్యం చేసుకోవ‌డంతో ఒక‌రిపై ఒక‌రు దాడి వ‌ర‌కు వెళ్లింది. గ‌ల్లాలు ప‌ట్టుకుని కార్యాల‌యం గ‌దిలో ప‌ర‌స్ప‌రం దాడులు చేసుకున్న ఇద్ద‌రు బ‌య‌ట‌కు వ‌చ్చి కొట్టుకున్నారు. దీంతో అక్క‌డ కాసేపు ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా ఇబ్బంది పెట్ట‌డ‌మే కాకుండా, త‌మ‌పై కార్య‌ద‌ర్శి దాడి చేశాడ‌ని సర్పంచ్ సులోచన ఆరోపించారు. ఈ దాడి సమాచారం అందుకున్న జన్నారం ఎస్సై సతీష్ పంచాయతీ కార్యాలయానికి చేరుకొని విచారణ చేపట్టి సర్పంచ్ సులోచనను తన వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like