అమెరికాలో మంచిర్యాల యువకుడి మృతి
-గుండెపోటుతో కుప్పకూలిన ఎంఎస్ విద్యార్థి
-ఆసుపత్రి తీసుకువెళ్లే సరికే ఆలస్యం
-వెళ్లిన పది రోజులకే మృత్యువాత
Death of a handsome young man in America: తమ కొడుకు అమెరికా వెళ్తున్నాడని ఉన్నత చదవులు చదువకుని తిరిగి వస్తాడని ఆ తల్లిదండ్రులు ఆశించారు. తాను కూడా ఉన్నత చదువులు చదివి తమ వారికి మంచి పేరు తీసుకురావాలని ఆ యువకుడు సైతం భావించాడు. వారి ఆలోచనలు అలా ఉంటే విధి మరోలా తలిచింది. ఆ యువకున్ని కానరాని లోకాలకు తీసుకుపోయింది.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువకుడు అక్కడే మృత్యువాత పడ్డాడు. ఉన్నత చదువులు చదువుకుని జీవితంలో మంచి ఉద్యోగంలో స్థిరపడాలని అనుకున్న ఆ యువకుడి కోరిక నెరవేరలేదు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన 26 ఏళ్ల శరత్ కుమార్ న్యూయార్క్ లో బుధవారం మృత్యువాత పడ్డారు. శరత్ ఆగస్టు 23వ తేదీన అమెరికాలోని న్యూయార్క్ సిటీకి చేరుకున్నారు. ముందుగా అక్కడ ఓ హోటల్ లో బస చేశారు. తరువాత ఓ రూమ్ కు మారాడు.
మంగళవారం రాత్రి ఆ రూమ్ కు మారిన శరత్.. అందులో తన వస్తువులను, బట్టలను సర్దుకుంటున్నాడు. ఈ సమయంలో గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే ఉన్న స్నేహితులు వెంటనే అతన్ని హాస్పిటల్ కు తీసుకువెళ్లే లోపే పరిస్థితి విషమించి చనిపోయాడు.
శరత్‌కుమార్ ది పాత మంచిర్యాల కాగా, ఆయన తండ్రి మల్క తిరుపతి.. మంచిర్యాల ఏసీపీ వద్ద గన్‌మెన్‌గా పని చేస్తున్నారు. శరత్ డెడ్ బాడీ న్యూయార్క్ సిటీలో ఉన్న సెయింట్‌విన్సెంట్స్ మెడికల్ సెంటర్ లో ఉంచారు. శరత్ మరణించిన విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేశారు. శవాన్ని మంచిర్యాలకు తీసుకువచ్చేందుకు తమకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని మృతుడి తండ్రి కోరుతున్నారు.