పేదింటికి పెద్ద కొడుకు కేసీఆర్
బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
సీఎం కేసీఆర్ పేదింటికి పెద్ద కొడుకుగా అన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఆయన బెల్లంపల్లి మున్సిపాలిటీ లోని పలు వార్డులకు చెందిన 268 మందికి పెన్షన్ గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ అన్ని వర్గాల వారికి పెన్షన్లు అందిస్తూ సామాన్యులకు తోడుగా నిలిచారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించిన ఆసరా పెన్షన్ పథకంతో అర్హులకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత,వైస్ చైర్మన్ సుదర్శన్,కౌన్సిలర్లు షేక్ అస్మా, సురేష్,గొసిక రమేశ్,భరద్వాజ్, గెల్లి రాజలింగు,నీలి కృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ బొడ్డు నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ నూనేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.